పాత భవనాలవారు జాగ్రత్త: డీసీపీ

by  |
పాత భవనాలవారు జాగ్రత్త: డీసీపీ
X

దిశ, హన్మకొండ: వరంగల్ నగరంలో‌ నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ జోన్ డీసీపీ కె. పుష్ప ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని పాత భవనాలలో నివసిస్తున్న ప్రజలు ముఖ్యంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలతో పాత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని భద్రకాళి, వడ్డేపల్లి, దేశాయిపేట చెరువులు మత్తడి పడుతుండటంతో సమీప ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే నాలాలు, కాల్వల్లోకి పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. వర్షాకాలం కావడంతో సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.



Next Story