‘ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి’

by Shyam |
‘ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి’
X

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండి స్వీయ నియంత్రణ పాటించాలని నకిరేకల్ సీఐ బాలగోపాల్ తెలిపారు. గురువారం నకిరేకల్ మండలం నోముల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వ్యాప్తి రాష్ర్టంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించాన్నారు. చిన్న చిన్న పనులకు సైతం బయటకు రావడం సరికాదన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags : People, vigilant, escape, clutches, corona, nalgonda, ci balagopal



Next Story

Most Viewed