- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిబంధనలు పక్కనెట్టి..ఇటుక బట్టీ..
దిశ, మహబూబ్‌నగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారిని ఎదుర్కొనేందుకు సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రధాని సహా పలు రాష్ట్రాల సీఎంలు, అధికారులు చెబుతూనే ఉన్నారు. సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ పీఎం మాట్లాడుతూ,దో గజ్ దూర్(రెండు గజాల దూరం) ప్రతి ఒక్కరూ పాటంచాలని సూచించారు. కానీ, జిల్లాలోని ఇటుకబట్టీల్లో ఆ నిబంధనలను పక్కనబెట్టారు. ఆ బట్టీల వ్యాపారులు కూలీలకు కనీస వసతులు కల్పించకపోగా, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం లేదు. అయితే, ఇందులో పని చేసే కూలీలంతా ఇతర జిల్లావాసులు. ఎండాకాలంలో వారికి తగిన సౌకర్యాలు కల్పించకపోవడంతో వారు అనారోగ్యం పాలవుతున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4,200 మంది వలస కార్మికులు ఇటుక బట్టీల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బట్టీలు ఎక్కువగా కనిపించే ప్రాంతాలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాలు, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి, పెబ్బైరు, గద్వాల, బాలానగర్, అచ్చంపేట. బట్టీల్లో రోజువారీగా పని చేసే వారు
సుమారు 3వేల మంది ఉంటారు. వీరంతా పరిసర గ్రామాల వారు.
దీనిపై ఆధార పడి సుమారు 1,670 ట్రాక్టర్‌లు నడుస్తుండగా వీటిపై ఆధార పడి మరో 3,900 మంది వరకు జీవనం సాగిస్తున్నారు. కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో ప్రైవేటు ఆస్పత్రులన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బట్టీల్లో పని చేసే కూలీలు పొద్దంతా మట్టిలో పని చేస్తుండగా ఏవైనా విషకీటకల వల్ల అనారోగ్యానికి గురైతై వారిని ఎక్కడికి తీసుకెళ్లాలని కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. కూలీలకు మాస్కులు ఇవ్వాలనీ, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఇటీవల మక్తల్ నియోజకవర్గంలో ఒక వలస కార్మికుడు మృత్యువాత పడ్డారు. ఈ విషయమై ఆరా తీయగా వారం రోజులుగా సదరు వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడని కుటుంబీకులు చెబుతుండగా, వడ్డదెబ్బ కారణంగా మృత్యువాత పడ్డడాని బట్టీ నిర్వాహకుడు అంటున్నాడు. వ్యాపారం కోసం బట్టీ నిర్వాహకులు కార్మికుల ప్రాణాలు పణంగా పెడుతుంటే అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులను అదుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలనీ, తాత్కాలికంగా బట్టి పనులను నిలిపివేసేలా చూడాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.
Tags: covid 19, prevention, people, not following, social distance, lockdown, palamuru