పెంగ్విన్ ఒంటరితనం..టెలీ‌సిరీస్‌తో చెక్

by  |
పెంగ్విన్ ఒంటరితనం..టెలీ‌సిరీస్‌తో చెక్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా పాండమిక్ వల్ల చాలా మంది లోన్లీనెస్ ఫీలయ్యారు. దాంతో మానసిక సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. కొన్ని దేశాల్లో ఆత్మీయ స్పర్శ అందుకోలేక బాధపడ్డారు. చిన్నారులు కూడా తమ అమ్మనాన్నలను హత్తుకోవడం కుదరకపోవడంతో కుమిలిపోయారు. ఓ చిట్టిపొట్టి పెంగ్విన్ కూడా..ప్రస్తుతం ఒంటరితనాన్ని అనుభవిస్తుంటే..దానికి ఓ పెంగ్విన్ సిరీస్ చూపించి ఓదార్చారు. అదెక్కడో తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

రాక్‌హోపర్ అనే అరుదైన జాతికి చెందిన ఓ చిట్టి పెంగ్విన్‌ పెర్త్ జూలోని ‘రీహాబిలిటేషన్’లో చికిత్స పొందుతూ ఉంది. సాధారణంగా పెంగ్విన్స్ అన్నీ కూడా ఓ ఫ్యామిలీలాగా గుంపులు గుంపులుగా ఉంటాయి. అయితే, ఈ పెంగ్విన్ మాత్రం సౌత్ అట్లాంటిక్ సముద్రం నుంచి ఆస్టేలియా ఐలాండ్స్‌కు ఈదుకుంటూ వచ్చింది. అది అంత దూరం నుంచి స్విమ్ చేసుకుంటూ రావడమే ఓ రికార్డని జూ అధికారులు చెబుతున్నారు. దానికి ఏడాది వయసు మాత్రమే ఉండటంతో పాటు అంత దూరం నుంచి నీళ్లలో ఈదుకుంటూ వచ్చినందుకు దాని రెక్కలు విచ్చుకోవడం లేదు.

చిట్టి పెంగ్విన్ ఆరోగ్యం కూడా కాస్త క్షీణించింది.. దాంతో పెర్త్ జూ అధికారులు దానికి చికిత్స అందిస్తున్నారు. అది ఒంటరిగా ఉండటంతో మరింత సిక్ అవుతున్నట్లు గమనించిన అధికారులు..దానికి ‘పింగూ’ అనే టెలివిజన్ సిరీస్‌ను చూపించి ఓదార్చారు. అంతేకాదు పలు జంతు ప్రదర్శన శాలల్లో ఉన్న పెంగ్విన్లను చూపిస్తూ.. దానిలో ఉత్సాహాన్ని తీసుకొస్తున్నారు. ‘‘లిటిల్ పెంగ్విన్ ప్రస్తుతం బాగానే ఉంది. దాని రెక్కలు వీలైనంత త్వరగా మళ్లీ యథాస్థితికి వస్తాయి. రోజూ దానికి పౌష్టికమైన ఆహారం అందిస్తున్నాం. అది మరింత బరువు పెరగాల్సిన అవసరముంది. ’’ అని జూ వెటర్నరీ వైద్యుడు డాక్టర్ పీటర్ రిస్సీ తెలిపాడు.


Next Story

Most Viewed