ఒక్క సంతకంతో భూమాఫియాకు చెక్

by srinivas |
ఒక్క సంతకంతో భూమాఫియాకు చెక్
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి భూమాఫియాకు ఒక్క సంతకంతో గవర్నర్ చెక్ చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వికేంద్రీకరణ ఆగలేదని అన్నారు. రాజధాని భూ అక్రమాలపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు హోం క్వారంటైన్ లో ఉన్నందునా.. వైసీపీ నేతలే కుప్పం ప్రజల బాగోగులు చూసుకోవాలని సూచించారు. రాజధానుల వికేంద్రీకరణ చేయకపోతే…భవిష్యత్తులో ప్రజలు కొట్టుకునే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు.

Advertisement

Next Story