రెవెన్యూ రికార్డుల చోరీకి వీఆర్వో విఫలయత్నం

by Shyam |
రెవెన్యూ రికార్డుల చోరీకి వీఆర్వో విఫలయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా చిట్యాల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం రికార్డులను ఎత్తుకెళ్లేందుకు పెద్ద కాపర్తి వీఆర్వో యత్నించాడు. గమనించిన కంప్యూటర్ ఆపరేటర్ శ్రవణ్‌తో పాటు మరో వ్యక్తి అడ్డుకోగా వారిపై దాడికి యత్నించి.. రికార్డులను వదిలి పారిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి వచ్చి వివరాలు తెలుసుకొని విచారణ చేపట్టారు. సోమవారం వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. వీఆర్వోలు రికార్డులను తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించాలని చెప్పిన విషయం తెలిసిందే. ఇదేక్రమంలో ఇవాళ ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లిన పెద్దకాపర్తి వీఆర్వో రికార్డులను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Next Story