- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరో రెండ్రోజుల్లో బియ్యం పంపిణీ పూర్తి
-పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఇప్పటి వరకు 88 శాతం రేషన్ కార్డుదారులకు 12 కేజీల బియ్యం పంపిణీ పూర్తయిందనీ, మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలో మొత్తం పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను, ఈ పాస్ మెషీన్ల పనితీరును ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. రేషన్ పోర్టబిలిటీ ద్వారా 13 లక్షల లావాదేవీలు జరిగాయని ఇందులో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఈ లావాదేవీలు నమోదయ్యాయన్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఇంత వేగంగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీకి సహకరించిన క్షేత్రస్థాయి పౌరసరఫరాల శాఖ అధికారులకు, రేషన్ డీలర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
tags :telangana, corona, poor, pds rice, civil supplies corporation