మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు

by  |
మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నకిలీ విత్తనాల కేసులో కీలక నిందితుడు, కర్నూలు జిల్లాకు చెందిన కర్నాటి మదుసూధన్ రెడ్డిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు చండూర్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు.

కొద్ది రోజుల క్రితం భారీగా నకిలీ పట్టివిత్తనాలు పట్టుకున్న జిల్లా పోలీసులు సమగ్ర విచారణ పూర్తి చేసిన తర్వాత జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ఆదేశాల మేరకు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో చండూర్ సీఐ సురేష్ కుమార్ శనివారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మదుసూధన్ రెడ్డిపై పీడీ యాక్ట్నమోదు చేశామని, నకిలీ పత్తి విత్తనాల కేసులలో కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని సురేష్ కుమార్ తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల బారిన రైతాంగం పడకుండా పటిష్ట నిఘాతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.


Next Story