- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్‌లో దోపిడీలు.. నిందితుడిపై పీడీయాక్ట్
దిశ, వరంగల్: దారి దోపిడీలకు పాల్పడుతున్న ఓ ఆటో డ్రైవర్‌పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ వరంగల్ సీపీ రవీందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌స్పెక్టర్ గణేష్ వివరాల ప్రకారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కంప విజయ్ వృత్తిరీత్య ఆటోడ్రైవర్. గత కొంతకాలంగా తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్నాడు. ఫిబ్రవరి 28న వరంగల్ మండిబజార్ ప్రాంతంలో ఓ వ్యక్తిని విజయ్ తన ఆటోలో ఎక్కించుకున్నాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి రూ. 10 వేల నగదు,సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మట్వాడా పోలీసులు మార్చి 5న విజయ్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఏడాది కాలంలో మొత్తం ఐదు దారి దోపిడీలకు పాల్పడినట్లు తేలింది. దీంతో విజయ్‌పై వరంగల్ సీపీ రవీందర్ పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు మట్వాడా ఇన్‌స్పెక్టర్ గణేష్ వరంగల్ కేంద్ర కారాగారంలో రిమాండులో ఉన్న నిందితుడికి పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేశారు.
Tags: thief, pd act, cp ravinder, prisoner, case file sudmited to thief