ఎవరు డబ్బు పంచినా.. మాకే ఓటెయ్యండి !

by Anukaran |
ఎవరు డబ్బు పంచినా.. మాకే ఓటెయ్యండి !
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎవరు డబ్బులు పంచినా ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. అది మన నుంచి దోచుకున్న సోమ్మే అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. సిద్దిపేట, దుబ్బాకకు టీఆర్ఎస్ నేతలు ఏం చేశారో జనం ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని, దీన్ని గమనించాలని సూచించారు. దుబ్బాక‌కు ఎమ్మెల్యే నేనే అని హరీశ్ రావు అంటున్నారని.. అక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థికి ఆత్మగౌరవం ఉండదా అని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ నేత చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నిక.. తెలంగాణ భవిష్యత్ ఎన్నిక అని.. కల్వకుంట్ల కుటుంబానికి గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ కమర్షియల్‌ చేశారని విమర్శించారు.

Advertisement

Next Story