- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గుర్తు పెట్టుకున్నాం, వాళ్లకు తర్వాత ఉంటది: ఉత్తమ్
by Sridhar Babu |

X
దిశ, వెబ్‌డెస్క్: పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని, వారిని గుర్తు పెట్టుకున్నామని, 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారి అరాచకాలు సాగనివ్వమని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ మోడీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు పూర్తిగా రైతు వ్యతిరేకం అన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగినా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించిన ఉత్తమ్.. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నేతల జేబులు నింపుకోవడం కోసమే నీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, కేంద్ర రాష్ట్రాలు తెలంగాణకు చేసింది శూన్యమని విమర్శించారు.
Next Story