ఉలుకూ పలుకు లేని ఉత్తమ్..

by Shyam |
ఉలుకూ పలుకు లేని ఉత్తమ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పీసీసీ చీఫ్ మార్పు జరగబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. పీసీసీ చీఫ్‌ మార్పుపై తర్వాత సమాధానమిస్తానని ఉత్తమ్ దాటవేశారు. ఇక దుబ్బాక ఉపఎన్నిక ఓటమిపై మాత్రం ఉత్తమ్ స్పందించలేదు.

కేసీఆర్ అసమర్థత వల్లే..

సీఎం కేసీఆర్ అసమర్థత వల్లే పంటల బీమా లేకుండా పోయిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఏకకాలంలో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు రైతులు సన్నరకం సాగుచేస్తే ఎకరాకు రూ.10వేల నష్టం వచ్చిందని ఆరోపించారు. రంగుమారిన పత్తికి రూ.5,800 ధర చెల్లించాలని కోరారు. అన్ని పంటలను మద్దతు ధరకే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మొన్న కురిసిన భారీ వర్షాలకు 13లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఉత్తమ్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed