- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆసియా కప్‌పై పీసీబీ విముఖత
by Shiva |

X
దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్ టీ20 టోర్నీని ఈ ఏడాది నిర్వహించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సుముఖంగా లేనట్లు సమాచారం. పీసీబీ చైర్మన్ ఎహ్‌సాన్ మణి ఈ మేరకు పీఎస్ఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాలకు ఆయన తెలియజేశారు. గురువారం ఫ్రాంచైజీ యాజమాన్యాలతో జరిగిన ఆన్‌లైన్ సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు పీసీబీ అధికారి ఒకరు చెప్పారు. ఆసియా కప్‌లో పాల్గొనే జట్లకు వేరే మ్యాచ్‌లు ఉండటంతో దానికి 2023కి వాయిదా వేసే అవకాశం ఉందని.. కాబట్టి జూన్-జులై సమయంలో వాయిదా పడిన పీఎస్ఎల్ నిర్వహించేందుకు పీసీబీ కసరత్తు చేస్తున్నట్లు మణి తెలిపారు. కాగా, ఏప్రిల్ లోనే పీఎస్ఎల్ నిర్వహించాలని ఇద్దరు యజమానులు కోరగా.. ఆ సమయంలో పాకిస్తాన్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్నందున సాధ్యపడదని ఎహ్‌సాన్ మణి తెలిపారు.
Next Story