పంజాబీ సాంగ్‌తో వచ్చేస్తున్న పాయల్..

by  |
పంజాబీ సాంగ్‌తో వచ్చేస్తున్న పాయల్..
X

అందాల బొమ్మ పాయల్ రాజ్‌పుత్.. తెలుగులో తొలి సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’తోనే నటిగా ప్రూవ్ చేసుకుంది. నెగెటివ్ క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇచ్చినా.. ఈ భామ కెరియర్ మాత్రం చాలా పాజిటివ్‌గా సాగుతోంది. రెండు ఐటెం సాంగ్స్, మూడు హీరోయిన్ పాత్రలు అన్నట్లుగా కెరియర్‌లో దూసుకుపోతోంది. లాక్‌డౌన్‌లో షూటింగ్స్‌కు దూరంగా ఉండడాన్ని తట్టుకోలేక పోయిన పాయల్ పాప.. ఎప్పుడెప్పుడు షూటింగ్స్‌కు హాజరైతే బాగుండు.. అన్న ఆతృతతోనే లాక్‌డౌన్ పీరియడ్ మొత్తం గడిపేసింది.

కాగా, నాలుగు నెలల తర్వాత చిత్రీకరణలో పాల్గొన్న పాయల్.. హమ్మయ్య! ఎంత రిలీఫ్‌గా ఉందో అని చెప్తోంది. ప్రస్తుతం ఓ పంజాబీ ఆల్బమ్ సాంగ్ షూటింగ్‌లో పాల్గొంటున్న పాయల్.. సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ‘ఈ రోజు కోసం నాలుగు నెలలుగా వెయిట్ చేస్తున్నా.. ఇన్నాళ్ల తర్వాత కెమెరాను ఫేస్ చేయడంతో ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి’ అని తెలిపింది. త్వరలో పంజాబీ సాంగ్‌తో మీ ముందుకు రాబోతున్నానని తెలిపిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ.. ఎప్పటిలాగే అభిమానుల ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పింది.



Next Story