ప్రైవేట్ పార్ట్ చూపించమన్న నెటిజన్.. హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్

by Shyam |
Payal Rajputh
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో ఫిమేల్ సెలబ్రిటీల పోస్టులపై నెటిజన్ల నెగెటివ్ కామెంట్లు వస్తూనే ఉన్నాయి. తనను రెండో పెళ్లి చేసుకోవాలని నటి వీజే అంజనను ఓ వ్యక్తి ఇటీవల కామెంట్ చేయగా అతడికి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది అంజన. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ పోస్టుపై నెటిజన్ వల్గర్ కామెంట్ చేశాడు. కాగా అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది పాయల్.

ఇటీవల పాయల్ రాజ్‌పుత్ ఫొటోషూట్‌కు సంబంధించిన ఒక హాట్ ఫొటో ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. అందులో తన ఎద భాగంకు ఒక క్యాప్‌ను అడ్డు పెట్టుకుని ఉండగా, దాన్ని తీసేస్తే వెనుక ఏం ఉందో చూడాలని ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కామెంట్ చేసిన వ్యక్తి మిడిల్ ఏజ్ పర్సన్ అని గుర్తించి అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది పాయల్. ‘నీకు సిగ్గు లేదు అనిపిస్తుంది.. నీకు ఈ వయసులో ఇలాంటివి కావాలా పెళ్లి అయ్యి ఉంటుంది కదా వెళ్లి నీ భార్యను అడుగు’ అని రిప్లై ఇచ్చింది. కాగా పాయల్ నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిందని ఆమె ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story