రిచాకు క్షమాపణ చెప్పిన పాయల్

by Jakkula Samataha |
రిచాకు క్షమాపణ చెప్పిన పాయల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేసింది. తనతో పాటు హూమా ఖురేషి, మహిగిల్, రిచా చడ్డాలను కూడా లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఈ ఆరోపణలపై పెద్ద రచ్చే జరగ్గా.. పాయల్‌పై పరువునష్టం దావా వేసింది రిచా. ఒకవేళ పాయల్ క్షమాపణ చెప్తే ఈ కేసు నుంచి బయట పడుతుందని ఆఫర్ ఇచ్చింది.

ఈ కేసు విచారణ సందర్భంగా పాయల్ లాయర్ రాజీ ఒప్పందం గురించి మాట్లాడారు. పాయల్ క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉందని.. తన అభ్యర్థనను స్వీకరించాలని కోరినట్టు సమాచారం. తను చేసిన ఆరోపణలపై బాధపడుతోందని, ఒక స్త్రీని కించపరచడం తన ఉద్దేశ్యం కాదని కోర్టుకు తెలిపారు. దీనికి రిచా లాయర్ కూడా అంగీకరించడంతో పరువు నష్టం దావా కేసు నుంచి బయటపడింది పాయల్.

కాగా, పాయల్ రూ. 1.1 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని బాంబే కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది రిచా.

Next Story

Most Viewed