- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి: ఎమ్మెల్సీ కసిరెడ్డి
దిశ, కల్వకుర్తి: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ను కోరారు. గురువారం జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా అన్నదాతలకు ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలుపుతూ.. హరీష్ రావు కు పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం కె ఎస్ ఐ, డి ఎల్ ఐ ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయి, నాలుగు సంవత్సరాల నుంచి నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ రైతులకు 5 కోట్ల 80 లక్షలు, వెల్దండ మండలం భైరాపూర్ గ్రామ రైతులకు డి ఎస్ఐ ప్రాజెక్టు ద్వారా సుమారు 33 కోట్లు, చెల్లించాలన్నారు. అలాగే మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామ రైతులకు 70 కోట్ల 16 లక్షలు చెల్లించాలని మంత్రి హరీష్ రావును ఎమ్మెల్సీ కసిరెడ్డి కోరారు. సానుకూలంగా స్పందించిన హరీష్ రావు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి కడుతున్న ప్రాజెక్టుల కోసం తమ భూములను, ఇళ్ళను, వ్యవసాయాన్ని కోల్పోతున్న వారి పట్ల ప్రభుత్వం అత్యంత సానుభూతితో వ్యవహరిస్తోందన్నారు. అలాగే భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. త్వరలోనే రైతులకు నష్టపరిహారం అందేలా డబ్బులు మంజూరు చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు.