అభిమానుల కుటుంబాలకు పవన్ సాయం

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో మంగళవారం రాత్రి బ్యానర్లు కడుతూ, ముగ్గురు అభిమానులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. జన సైనికుల మరణం మాటలకు అందని విషాదం అని అన్నారు. విద్యుత్ షాక్‌తో మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. అంతేగాకుండా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. భాదిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement