పవన్‌కు కరోనా నెగెటివ్

by vinod kumar |   ( Updated:2021-04-20 05:06:55.0  )
పవన్‌కు కరోనా నెగెటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల పవన్ కరోనా బారిన పడగా.. గత కొద్దిరోజులుగా తన ఫాంహౌస్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నిన్న పవన్‌కి టెస్టు చేయగా.. ఇవాళ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్టులో పవన్‌కి నెగెటివ్‌గా తేలింది. దీనిపై జనసేన కార్యాలయం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పవన్‌కి నెగెటివ్‌గా తేలడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకుంటున్నారు. పవన్‌కి కరోనా సోకడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఆయన కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు.

Advertisement

Next Story