పవన్ హాజరయ్యే ఫస్ట్ బుల్లితెర షో అదే

by Jakkula Samataha |
పవన్ హాజరయ్యే ఫస్ట్ బుల్లితెర షో అదే
X

దిశ, సినిమా : బుల్లితెరపై ప్రదీప్ మాచిరాజు సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నారు. యాంకర్‌గా తెలుగు ప్రజల నుంచి ప్రత్యేక ఆదరణ పొందిన ఆయన.. ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ షో ద్వారా సెలబ్రిటీల పర్సనల్ అండ్ సినిమా కెరియర్ గురించి ఆడియన్స్‌కు పరిచయం చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పటికే నాలుగు సీజన్లు ముగియగా.. ఎంతో మంది టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీల ఇంటర్వ్యూలతో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయించాడు.

ఈ క్రమంలోనే ఐదో సీజన్‌కు సన్నాహాలు చేస్తున్న ప్రదీప్.. ఈ సారి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను సెలబ్రిటీగా తీసుకురాబోతున్నారని సమాచారం. ఇప్పటికే పవన్‌ను కలిసిన ప్రదీప్.. డేట్స్‌ కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. ఇదే జరిగితే పవన్ గెస్ట్‌గా హాజరైన ఫస్ట్ బుల్లితెర ప్రోగ్రామ్ ఇదే కానుంది.



Next Story

Most Viewed