ఆదుకునేదాకా పోరాడతా : పవన్

by srinivas |
ఆదుకునేదాకా పోరాడతా : పవన్
X

దిశ, ఏపీ బ్యూరో: ‘మద్యం ద్వారా ప్రభుత్వం బాగానే ఆర్జిస్తోంది. ఆ సొమ్ముతో తుపానుకు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్​కల్యాణ్ ​ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే సోమవారం నుంచి నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కన్నీటి పర్యంతమవుతున్న రైతులకు భరోసానిచ్చారు. కావలిలో అక్రమ లేఅవుట్ల కారణంగా వరద నీరు పారుదల నిల్చిపోయి రైతుల పంటలను ముంచేసిందని తెలిపారు. రైతులను ప్రభుత్వం ఆదుకునేదాకా పోరాడతానని పవన్​ వెల్లడించారు.

Advertisement

Next Story