పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. కేరీర్ బెస్ట్ స్పెషల్ రోల్‌లో పవర్ స్టార్!

by Shyam |   ( Updated:2021-12-20 00:57:10.0  )
పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. కేరీర్ బెస్ట్ స్పెషల్ రోల్‌లో పవర్ స్టార్!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా పవన్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, అది ఓ ఫాంటసీ సినిమా అని టాక్ నడుస్తోంది. పవన్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఓకే ఒక ఫాంటసీ సినిమా చేశాడు. అది ‘గోపాలా గోపాలా’. ఈ సినిమా హిందీ సినిమా ‘ఓ మై గాడ్’కు రీమేక్‌గా తెరకెక్కి అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సారి పవన్ తమిళంలో వచ్చిన ఫాంటసీ సినిమా ‘వినోదయ చిత్తం’ మూవీని రీమేక్ చేయాలని చూస్తున్నాడట. ఈ మేరకు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. త్వరలో ఏమైనా ప్రకటిస్తారేమో వేచి చూడాలి.

‘వినోదయ చిత్తం’ సినిమాను సముద్రఖని డైరెక్ట్ చేశాడు. అంతేకాకుండా సినిమాలో ఓ కీలక పాత్రలోనూ కనిపించి అలరించాడు. పరశురామయ్యర్ అనే వ్యక్తి ఓ ఫ్యాక్టరీలో చాలా ఏళ్లుగా పనిచేస్తుంటాడు. ఆ కంపెనీ మేనేజర్ పదవి అతడి కల. కానీ అది నెరవేరకుండానే ప్రమాదవశాత్తు మరణిస్తాడు. అదే సమయంలో ‘టైమ్’ అనే వ్యక్తి పరశురామయ్యర్‌కి తన బాధ్యతలు, కల నెరవేర్చుకునేందుకు మూడు నెలల సమయం ఇస్తాడు. ఆ మూడు నెలల్లో పరశురామయ్యర్‌ తన కల నేరవేర్చుకున్నాడా లేదా? మూడు నెలలు ఎలా గడిపాడు? అన్నది సినిమా కథ. ఇందులో ‘టైమ్’ అనే పాత్రలోనే పవర్ స్టార్ కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. నిజానిజాలు తెలియాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే.

మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఆ కాంబో డౌటే..?

Advertisement

Next Story