కేంద్ర హోంమంత్రి త్వరగా కోలుకోవాలి : పవన్

దిశ, వెబ్ డెస్క్ :
సెంట్రల్ హోంమినిస్టర్ అమిత్‌ షా త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. షా కు కరోనా సోకిందని తెలియగానే బాధ అనిపించిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండగా, ఉత్సాహంగా కూడా ఉన్నారని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బీజేపీ నాయకుల ద్వారా తెలిసిందని పవన్ తెలిపారు. ‘నిరంతరం ప్రజల కోసం తపిస్తూ, ప్రజల మధ్య ఉండే అమిత్ షా సహజంగానే కొవిడ్ వంటి సంక్రమిక వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల ముందుకు రావాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం వ్యక్తంచేశాడు. అంతేకాకుండా ఆ భగవంతుడు అమిత్ షాకు అండగా ఉండాలి.. త్వరగా కోలుకోవాలి’ అని ప్రార్థిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.

Advertisement