పవన్ అభిమానులకు పండగే…

by  |
పవన్ అభిమానులకు పండగే…
X

దిశ వెబ్ డెస్క్: రెండేళ్ళ గ్యాప్‌ను ఫుల్ ఫిల్ చేయడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఎవరి ఊహకందని చర్యలు తీసుకోవడం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత. రాజకీయాలలోకి వెళ్ళిపోయాడు.. ఇక సినిమాలలోకి రాలేడనుకున్నారు. అనుకున్నందుకే వచ్చాడా.. అభిమానుల కోసం వచ్చాడా, లేక పవర్ స్టార్ క్రియేట్ చేయాల్సిన కొత్త రికార్డ్ లు మిగిలాయని వచ్చాడో తెలియదు కానీ మొత్తానికి వకీల్ సాబ్ గా దూకాడు.

అందరూ ఈ ఒక్క సినిమా చేసి ఊరుకుంటాడనుకున్నారు. అయితే పవర్ స్టార్ ఏదిచ్చినా గ్రాముల్లో కిలోల్లో కాదు టన్నుల్లోనే ఇస్తాడు. అందుకే ఒకే రోజు నాలుగు భారీ సినిమాలను ప్రకటించాడు. సోషల్ మీడియా షేక్. ఇండస్ట్రీ మొత్తం షాక్, ఇదే కదా అందరు కోరుకునేది. నిజంగానే పవర్ స్టార్ చర్యలు ఊహాతీతమని చెప్పాలంటే ఇంతకంటే ఉదాహరణలు ఇంకా ఏం కావాలి.

ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్ సినిమా మోషన్ పోస్టర్, క్రిష్‌తో చేస్తున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి తో చేస్తున్న సినిమాల అధికారక ప్రకటన. వరసగా వచ్చాయి. అందరూ ఎదురు చూసిన కాంబినేషన్ కి సంబంధించి అప్‌డేట్ మాత్రం రాలేదు.

ఆ కాంబినేషనే పవన్ కళ్యాణ్- త్రివిక్రం శ్రీనివాస్. రీసెంట్ గా వచ్చిన నాలుగు సినిమాలు. ఇవి కంప్లీట్ చేసి మళ్ళీ రాజకీయాల్లోకి వెళతాడని భాస్తున్నారు. కాని ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉంటుందట. పవన్ డై హార్ట్ ఫ్యాన్స్ త్రివిక్రం దర్శకుడు… హీరో నితిన్ నిర్మాత అంటున్నారు. పవర్ స్టార్ కెరీర్ 30 వ సినిమా. త్రివిక్రం తోనే ఉండబోతోందని సమాచారం.


Next Story

Most Viewed