ఇది ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే : పవన్

by srinivas |

వివాదాలకు తావులేని భూములనే ఇళ్ల స్థలాలకు కేటాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాలకు కేటాయిస్తే వివాదాలు తలెత్తుతాయన్నారు. ఇళ్లు లేని పేదలకు స్థలం కేటాయించడాన్ని ఎవరూ తప్పుబట్టరు అని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూములను పంచాలని విమర్శించారు. ఓ వైపు భూములిచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే.. మరోవైపు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఉత్వర్వులు ఇవ్వడం సరికాదని, ఇది ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుందన్నారు.

Advertisement

Next Story