- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సగటు మనిషికి న్యాయమేది: పవన్

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలకు అవసరమైన సంక్షేమాలు అందిస్తూ.. వారి ప్రయోజనాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దీంతో సగటు మనిషికి న్యాయం జరిగే పరిస్థితి లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన లీగల్ సెల్ సభ్యులతో పవన్ కళ్యాణ్ బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కొందరు ప్రభుత్వ అధికారులు కార్యకర్తల్లా మారితే సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ప్రజల పట్ల సేవాభావంగల న్యాయవాదుల సహాయం మరింతగా తీసుకోవాలన్నారు. ఇటువంటి న్యాయవాదుల సంక్షేమానికి జనసేన కట్టుబడి ఉంటుందని పవన్ భరోసా ఇచ్చారు. అలాగే, న్యాయస్థానల్లో పిటిషన్లు స్వీకరణను వేగవంతం చేయాలన్న ఆయన.. న్యాయవాదులకు బీమా కల్పించాలని డిమాండ్ చేశారు.