పవన్‌పై ముదిరిన అభిమానం.. రేగిన వివాదం!

దిశ, వెబ్‌డెస్క్ :

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 49పుట్టిన రోజును ఫ్యాన్స్ పండుగలా జరుపుకున్నారు. అంతుకు ముందు నుంచే సెలెబ్రేషన్‌కు సంబంధించి ప్రిపరేషన్ చేస్తూ వచ్చారు అభిమానులు. అయితే, పవన్ పుట్టిన రోజున తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా, అమరావతి మండలం లింగాపురం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఫ్లెక్సీ వివాదం చెలరేగింది.

ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టొద్దని ఓ వర్గం వాదించగా.. ఇక్కడే పెడతామని మరో వర్గం బదులిచ్చింది. మాటా మాటా పెరగడంతో అది కాస్త ఘర్ఫణకు దారి తీసింది. ఈ దాడుల్లో ఇరువర్గీయుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గీయులను చెదరగొట్టి గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమరావతి పోలీసులు తెలిపారు.

Advertisement