- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఊరికే పవర్ స్టార్ అయిపోరు..10 పేజీల డైలాగ్.. సింగిల్ టేక్
దిశ, సినిమా : ఊరకే పవర్ స్టార్ అయిపోతారా ఏంటి?.. ఎన్నో ఏళ్ల శ్రమ, పట్టుదల, అన్న పేరు నిలబెట్టాలనే తపన, నిద్రలేని రాత్రులు. అన్నీ వెరసి… పవన్ కళ్యాణ్ పవర్ స్టార్‌గా అవతరించాడు. పవర్ ఫుల్ కటౌట్, యూనిక్ స్టైల్, అమేజింగ్ డైలాగ్ డెలివరీ. ప్రతీ విషయంలోనూ స్పెషల్‌గా ఉండే పవన్ సినిమా అంటే ప్యాషన్‌తో ఉంటారని తెలిపాడు నటుడు శివ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘వకీల్ సాబ్’ మూవీ గురించి మాట్లాడుతూ.. పవన్‌తో పనిచేసిన అనుభవాలను షేర్ చేసుకున్నారు.
పవన్‌తో 28 రోజుల పాటు కోర్టు సీన్స్ షూటింగ్‌లో పాల్గొన్నాను. కానీ ఏ ఒక్కరోజు ఆయన పడుకున్నట్లుగా అనిపించలేదన్నాడు. షూటింగ్ అయిపోయాక మీటింగ్స్‌కు అటెండ్ అయ్యి అక్కడనుంచి మళ్లీ నేరుగా షూటింగ్‌కు వచ్చేవాడని వివరించాడు. అయినా సరే డైలాగ్ చెప్పేటప్పుడు ఏ మాత్రం ఎనర్జీ డ్రాప్ అయ్యేది కాదని తెలిపాడు. 10 పేజీల డైలాగ్.. ఎనిమిది కెమెరాలు.. చుట్టూ జనం.. సింగిల్ టేక్‌లో సీన్ కంప్లీట్ చేసేవాడని చెప్పాడు. ఎంత అన్నయ్య రిఫరెన్స్‌తో ఇండస్ట్రీలోకి వచ్చినా… కష్టపడనిదే స్టార్.. పైగా పవర్ స్టార్ అయిపోలేరని అనిపించిందన్నాడు శివ.