కేసీఆర్‌పై పవన్ ఫైర్

by Shyam |
కేసీఆర్‌పై పవన్ ఫైర్
X

దిశ, శేరిలింగంపల్లి: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని, యువతకు ఎలాంటి ఉపాధి లభించడం లేదని బీజేవైఎం నాయకుడు, మెదక్ జిల్లా బీజేవైఎం ఇంఛార్జ్ నాయినేని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మంగళవారం కేపీహెచ్‌బీ జేఎన్ టీయూ మెయిన్ సెంటర్‌లో బీజేవైఎం కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. బూటు పాలీష్ చేస్తూ నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా తెలంగాణలో నిరుద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారని, ఉపాధి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఎన్నికలు ఉన్నచోట ఏదో ఒక పథకం ప్రకటిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారే కానీ.. యువతకు ఉపాధి కల్పించాలన్న చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ భర్తీ ప్రక్రియ చేపట్టాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని పవన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story