గాంధీలో గందరగోళం..అనారోగ్యంతో చేరి మార్చురీలో తేలాడు

by  |
గాంధీలో గందరగోళం..అనారోగ్యంతో చేరి మార్చురీలో తేలాడు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో గత కొద్ది రోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. వైరస్ బారిన పడి మృతి చెందిన వారి మృతదేహాల తారుమారు వ్యవహారంలో బంధువులు జూడాలపై దాడి చేయడం, వారు ఆందోళనకు దిగడంతో పరిస్థితులు అన్ని తారుమారయ్యాయి. అంతేకాకుండా రాష్ట్రంలో రోజువారీగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో రోగులను పట్టించుకునే వారు కరువయ్యాడని స్వయాన రోగులే వీడియో సందేశం ద్వారా చెప్పడం మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. ఇదిలాఉంటే గత నెల 31న అనారోగ్యంతో గాంధీలో చేరిన నరేందర్ సింగ్ కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు గాంధీ వైద్యుల తీరుపై సీరియస్ అయ్యారు. అనంతరం ఈ నెల 1వ తేదీ నుంచి అతని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఎంతకీ నరేందర్ సింగ్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో, శనివారం గాంధీ మార్చురీలో వెతకగా బంధువులు అతని మృతదేహాన్నిగుర్తించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితో అతని బాగోగులు చూడకుండా.. కనీసం మరణవార్త కూడా చెప్పకుండా డెడ్‌బాడీని దాచేస్తారా అని బాధిత కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేందర్ సింగ్ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, అసలు చనిపోవడానికి కారణం ఎంటీ? సిబ్బంది ఈ విషయాన్ని ఎందుకు దాచారనే విషయంపై సీఐడీతో దీనిపై విచారణ జరిపించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.


Next Story