- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేపే నిర్భయ హంతకులకి ఉరి !
న్యూఢిల్లీ : నిర్భయ కేసులోని నలుగురు దోషుల ఉరి శిక్ష అమలుపై స్టే విధించాలని చేసిన విజ్ఞప్తిని ఢిల్లీలోని పటియాల హౌజ్ కోర్టు తిరస్కరించింది. రేపు ఉదయం ఆరు గంటలకు నలుగురు దోషులకు ఉరి అమలు చేయాలని గతంలో డెత్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వాలని దోషుల తరఫు న్యాయవాదులు పటియాలా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దోషులు పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌ల క్షమాభిక్ష పిటిషన్‌లు పెండింగ్ ఉన్నాయని, కాబట్టి వాటిపై నిర్ణయం వెలువడే వరకు డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిని విచారిస్తూ ఉరి శిక్ష అమలుపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో నిర్భయ దోషులు అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, వినయ్ శర్మలను రేపు పొద్దున తీహార్ జైలులో ఉరితీయనున్నారా? అని ఉత్కంఠ మొదలైంది.
Tags : nirbhaya convicts, to be hanged, death warrant, patiala court, tihar jail