- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ధోని కోసమే కాదు అందరి కోసం ఓ మ్యాచ్ ’

దిశ, స్పోర్ట్స్ : ఇటీవల అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కోసం ఒక మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రతిపాదనపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ధోని కోసమే కాకుండా రిటైర్ అయిన అందరి కోసం ఒక చారిటీ మ్యాచ్ నిర్వహించాలని పఠాన్ కోరాడు.
గతంతో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజాలందరినీ ఒక జట్టుగా చేర్చి కొహ్లీ సేనతో ఒక మ్యాచ్ ఆడించాలని పఠాన్ ప్రతిపాదించాడు. గతంలో రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్, అంబటి రాయుడు, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ వంటి క్రికెటర్లతో కూడిన జట్టును ప్రస్తుత టీం ఇండియా జట్టుతో ఆడించాలని పఠాన్ సూచించాడు. మహీ వీడ్కోలు మ్యాచ్ గురించి నడుస్తున్న చర్చతో అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా పఠాన్ ఈ ప్రతిపాదన చేశాడు. ట్విటర్ వేదికగా సెండాఫ్ లేని ఆటగాళ్ల జాబితాను కూడా పంచుకున్నాడు.