- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రన్‌వేపై విమానాన్ని నెట్టిన ప్రయాణికులు.. వీడియో వైరల్!
దిశ, ఫీచర్స్: బైక్ లో పెట్రోల్ అయిపోతే తోసుకుని వెళ్తుంటాం. అలాగే కారు ఆగిపోతే తోటి స్నేహితులతో నెట్టించిన సందర్భాలు ఉండే ఉంటాయి. ఇక ఎప్పుడైనా ఆర్టీసీ బస్సు ఆగిపోతే.. ప్రయాణికులంతా కలిసి తోసిన దృశ్యాలు చూడటమో లేదా స్వయంగా అనుభవించడమో జరిగే ఉంటుంది. కానీ విమానాన్ని మూవ్ చేసేందుకు ప్యాసింజర్స్ కష్టపడటం మాత్రం కచ్చితంగా చూసి ఉండరు. ఆ అరుదైన దృశ్యానికి నేపాల్, కోల్టీలోని బజురా విమానాశ్రయం వేదికైంది. కొంతమంది వ్యక్తుల రన్‌వేపై విమానాన్ని తోస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కోల్టీలోని బజురా ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుండగా.. వెనుక టైర్ పేలింది. దీంతో ఆ విమానం రన్‌వే మధ్యలో కదలకుండా ఆగిపోయింది. ఇదే సమయంలో వచ్చిన మరో విమానం ల్యాండింగ్‌కు ఇబ్బంది ఎదురైంది. ఆగిపోయిన విమానాన్ని అత్యవసరంగా పక్కకు లాగేందుకు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో భద్రతా సిబ్బందితో కలిసి ప్రయాణికులు నెట్టాల్సి వచ్చింది. ‘తారా’ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానాన్ని నెట్టడాన్ని కొంతమంది ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో షేర్ చేయగా ట్రెండింగ్‌లో నిలిచింది.
దాదాపు 20 మంది వ్యక్తులు రన్‌వే నుంచి విమానాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గా ఈ ఫుటేజీలో కనిపించింది. ఇదిలా ఉండగా తాజాగా మరో విమానం వింత కారణాలతో వార్తల్లో నిలిచింది. ఢిల్లీ విమానాశ్రయానికి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఎయిర్ ఇండియా విమానం చిక్కుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
డెబిట్ కార్డు మరిచిపోయారా..? ATMలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి విత్‌డ్రా చేయండిలా!
सायद हाम्राे नेपालमा मात्र होला ! pic.twitter.com/fu5AXTCSsw
— Samrat (@PLA_samrat) December 1, 2021