హితవు పలికిన పరుచూరి

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ పలు రాజకీయ, సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తన ప్రత్యేకమైన మాటలతో సమాజానికి, వ్యక్తులకు ఏదో ఒక కీలక సమాచారాన్ని చేరవేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పరుచూరి ట్వీట్ చేస్తూ.. ‘అవిశ్వాసం, అనిశ్చితి అనే జోడు గుర్రాల రథం మీద అనుమానం అనే వ్యాధితో పయనించేవారు ఎన్నటికీ మజిలీ చేరుకోలేరు. విశ్వాసం, సంకల్పం అనే జోడు గుర్రాల రథం మీద స్ఫూర్తి అనే ధ్యేయంతో ప్రయాణం చేసేవారు ఎన్నటికీ అపజయం పొందరు. మిమ్మల్ని మీరు నమ్ముకోలేకపోతే ఇక లోకాన్నేమి నమ్ముతారు సన్నిహితులారా’.. అంటూ హితవు పలికారు.

Advertisement