- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాంపస్‌లో పార్టీలు, మాస్ గేదర్స్‌కు అనుమతి లేదు
దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ క్యాంపస్‌లో పార్టీలకు, మాస్ గేదర్స్‌కు అనుమతి లేదని ఆ యూనివర్సిటీ పేర్కొన్నది. అంతేగాక సెకండ్ సెమిస్టర్ పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులకు అవుట్ పాసింగ్‌లు ఇవ్వబోమని చీఫ్ వార్డెన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4 నుంచి హాస్టళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. విద్యాసంస్థ క్యాంపస్‌లో ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ డిస్కషన్స్, మాస్ గేదర్స్ కు అవకాశం లేదని వివరించారు. బర్త్ డే, ఫెయిర్ వెల్ పార్టీలకు, ఫొటో షూట్‌లను నిషేధించినట్లు పేర్కొన్నారు. బయట నుంచి వచ్చే ఆహార పదార్ధాలకు అనుమతి లేదన్నారు.
హాస్టళ్లలోని రూమ్‌లను ఇప్పటికే శుభ్రం చేశామని, ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే చీఫ్ వార్డెన్‌ను సంప్రదించాలన్నారు. వాష్ రూంలు, హాస్టళ్ల గదులను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచేందుకు సహకరించాలన్నారు. కొవిడ్ సింప్టమ్స్ ఉంటే వెంటనే హెల్త్ కేర్ వర్కర్ లేదా, చీఫ్ వార్డెన్‌కు తెలియజేయాలని కోరారు. చాలా రోజుల నుంచి హాస్టళ్లు మూసివేసినందున కీటకాలు, పాములు ఉండే అవకాశం ఉన్నదని, విద్యార్థులంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు. విద్యార్థులంతా నిత్యం మాస్కులను ధరించాలన్నారు. క్యాంపస్ విడిచి పెట్టిన విద్యార్థుల విలువైన వస్తువులకు తమ బాధ్యత కాదని తేల్చి చెప్పింది.
సాయంత్రం 5 నుంచి ఉదయం 6 గంటల వరకు బయటకు వెళ్లేందుకు విద్యార్థులకు అనుమతి లేదని చీఫ్ వార్డెన్ వెల్లడించారు. విద్యార్థులకు ఏవైన సమస్యలు తలెత్తితే వెంటనే 9492303856, 9492301902 నంబర్లను సంప్రదించాలని వెల్లడించింది. యూనివర్సిటీ సూచించిన మార్గదర్శకాలను పాటించని విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని చీఫ్ వార్డెన్ హెచ్చరించారు.