ఆకాశంలో అద్భుతం.. ఈనెల 19న ఆ రూపంలో దర్శనమివ్వనున్న జాబిల్లి

by Anukaran |   ( Updated:2021-11-07 00:58:12.0  )
ఆకాశంలో అద్భుతం.. ఈనెల 19న ఆ రూపంలో దర్శనమివ్వనున్న జాబిల్లి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆకాశంలో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతా ఉంటాయి. ఇప్పుడు అలాంటి అద్భుతమే ఆకాశంలో జరగనుంది. ఆకాశంలో ఒక్కసారిగా మార్పులు కనిపించడం.. లేదా చందమామ తన రంగును మార్చుకోవడం వంటివి అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ నెల 19న చందమామ మన అందరిని తన వైపు తిప్పుకోవడానికి రెడీ అవుతున్నాడు. తన రంగును మార్చుకొని మనందరికి కనువిందు చేయనున్నాడు.

అది ఎలా అనుకుంటున్నారా.. నవంబరు 19న కార్తిక పౌర్ణమి రోజు శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహణం ఏర్పడనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుండగా, భారతకాలమానం ప్రకారం నవంబరు 19న శనివారం మధ్యాహ్నం ఒకటిన్నరకు చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి .. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. 3 గంటల 28 నిమిషాల పాటు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణం, చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అంటే 19న జాబిల్లి ఎర్రటి వర్ణంలో కనిపించి కనువిందు చేయనున్నట్టు తెలుస్తోంది.

కార్తీక స్నానం ఎప్పుడు చేయాలో తెలుసా ?

Advertisement

Next Story