- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్షిక లాక్‌డౌన్ వల్ల పారిశ్రామికోత్పత్తిపై ప్రభావం అధికం : సీఐఐ
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా అమలు చేస్తున్న పాక్షిక లాక్‌డౌన్ వల్ల కూలీలతో పాటు ముడిసరుకులపై ప్రభావం ఉంటుందని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలిపింది. ఇటీవల పలు రాష్ట్రాల్లో విధిస్తున్న పాక్షిక లాక్‌డౌన్‌తో పారిశ్రామిక రంగంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశంపై సీఐఐ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా కార్మికులు, ముడిసరుకులపై ప్రభావం అధికంగా ఉంటుందని సీఐఐ సర్వేలో పాల్గొన్న సీఈఓలు స్పష్టం చేశారు.
లాక్‌డౌన్ భయంతో కార్మికులు మరోసారి పనులకు దూరమైతే లేబర్ కొరత తప్పదని, దీనివల్ల దేశీయ పారిశ్రామికోత్పత్తి పడిపోయే ప్రమాదం ఉందని సీఐఐ అధ్యక్షుడు నరేంద్రన్ చెప్పారు. ఈ పరిణామాల వల్ల పారిశ్రామికోత్పత్తి 50 శాతం తక్కువకు క్షీణించవచ్చని సర్వేలో పాల్గొన్న 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో కార్మికుల ఆరోగ్యం, భద్రత కోసం సరైన నిర్ణయాలను అమలు చేయాలని, అలాగే పరిశ్రంలో పనితీరును పెంచే చర్యలు చేపట్టాలన్నారు. లాక్‌డౌన్ ప్రభావాన్ని తగ్గించేందుకు పరిశ్రంలో ఉన్నటువంటి 45 ఏళ్లకు పైబడిన వారికి ప్రభుత్వ సహకారంతో సాముహిక టీకాను అందించడం అవసరం ఉందని సర్వేలో పాల్గొన్న 67 శాతం మంది వెల్లడించారు.