- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మున్సిపాలిటీలో పాక్షిక లాక్ డౌన్
దిశ, హలియా: కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజారోగ్య పరిరక్షణ కోసం హాలియా మున్సిపాలిటీ పరిధిలో శనివారం నుంచి పాక్షికంగా లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హలియా పట్టణ కేంద్రంలోని వర్తక, వాణిజ్య, ఫెర్టిలైజర్స్, మొబైల్స్ దుకాణాలు 08-05-2021 నుండి 30-05-2021 వరకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయన్నారు. ఆ సమయంలోనే ప్రజలు తమకు కావాల్సిన సరుకులను తీసుకోవాలని సూచించారు.
తర్వాత ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాబట్టి వ్యాపారస్తులు, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించి, శానిటైజర్ ఉపయోగించాలని తెలిపారు. ప్రతిఒక్కరూ సహకరించి ఎవరికి వారే స్వచ్చందంగా లాక్డౌన్ లో పాల్గొని జయప్రదం చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు.