ఏపీలో పాక్షిక కర్ఫ్యూ.. మినహాయింపు వాటికి మాత్రమే..!

by Anukaran |
Ys Jagan
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ నివారణ చర్యల్లో ప్రభుత్వం మరో ముందగుడు వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూను విధిస్తునట్టు.. కోవిడ్‌పై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని షాపులు తెరిచేఉండనున్నాయి. ఆ తర్వాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇదే సమయంలో 144 సెక్షన్ కూడా అమలులో ఉండనుంది. బుధవారం నుంచి మరో రెండు వారాల వరకు కర్ఫ్యూ విధిస్తూ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story

Most Viewed