- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ అంశంపై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో మ్యాన్‌వల్ స్కావెంజింగ్ కొనసాగుతుండంపై సామాజిక న్యాయం, సాధికారత పార్లమెంటరీ కమిటీ తీవ్రంగా మండిపడింది. ఆయా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మురుగు కాల్వలు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రచేయడానికి మనుషులను ఉపయోగిస్తున్న కాంట్రాక్టర్లపై కఠినమైన చర్యలకు పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు చేసింది. దేశంలో మ్యాన్‌వల్ స్కావెంజింగ్‌పై 1993లోనే నిషేదం విధించినట్టు కమిటీ తెలిపింది. అయినప్పటికీ ఇంకా 18 రాష్ట్రాల్లోని 194 జిల్లాల్లో మ్యాన్‌వల్ స్కావెంజింగ్ కొనసాగుతోందని కమిటీ వివరించింది. ఇప్పటి వరకు కేవలం 49 జిల్లాలు మాత్రమే ఈ నిషేదాన్ని పాటిస్తున్నాయని కమిటీ పేర్కొంది. నిషేదాన్ని అమలు పరిచే సంస్థలు, మున్సిపాలిటీలు సమర్థ వంతంగా పనిచేయనంత కాలం మంత్రిత్వ శాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా మ్యాన్‌వల్ స్కావెంజింగ్ నిషేదంలో విజయం సాధించలేదని పేర్కొంది. స్కావెంజింగ్ చేస్తున్న సమయంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించకపోవడంపై కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.