‘పెగాసస్ స్పైవేర్’ దుమారం.. ఉభయసభలు మళ్లీ వాయిదా..!

by Shamantha N |   ( Updated:2021-07-20 03:09:32.0  )
‘పెగాసస్ స్పైవేర్’ దుమారం.. ఉభయసభలు మళ్లీ వాయిదా..!
X

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండోరోజూ కూడా వాయిదాల పర్వంతో కొనసాగుతున్నాయి. ఉభయసభలు ప్రారంభమైన ఆదిలోనే ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీల ఎంపీలు కేంద్రాన్ని మాట్లాడనివ్వడం లేదు. దేశంలో దుమారం లేపిన ‘పెగాసస్ స్పైవేర్’ హ్యాకింగ్, ఇంధన ధరల పెరుగుదలపై మోడీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు నాన్‌స్టాప్‌గా ఆందోళన చేశాయి. దీంతో రాజ్యసభ 12 గంటల వరకు, లోక్‌సభ 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఇదిలాఉండగా, ప్రతిపక్షాల తీరుపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story