నటించాలనుకోలేదు.. తనలా ఉండాలనుకున్నా : పరిణీతి

by Shyam |
Parineeti Chopra
X

దిశ, సినిమా : ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వా్ల్ బయోపిక్‌‌లో నటించిన పరిణీతి చోప్రా.. సినిమా గురించి తన అనుభవాలు పంచుకుంది. ‘సైనా’ పేరుతో తెరకెక్కిన మూవీని తన కెరియర్‌లోనే మోస్ట్ చాలెంజింగ్, ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్‌గా పేర్కొంది. సైనా సింప్లిసిటీ, సంకల్ప బలమే.. లక్ష్యాల పట్ల జాగ్రత్తగా, కఠినంగా ఉండేలా తనను ప్రోత్సహించాయని చెప్పింది. సైనా రోల్ కోసం ప్రిపరేషన్స్ మొదలెట్టాక ‘మే మార్ దూంగి’ అనే పదం తనకు ఊతపదంగా మారిపోయినట్లు తెలిపింది. నిజం చెప్పాలంటే సినిమాలో సైనా లాగా యాక్ట్ చేయాలనుకోలేదని, అచ్చం తనలాగా కనిపించాలని అనుకున్నానన్న పరిణీతి.. తెర మీద ఆ మ్యాజిక్‌ను క్రియేట్ చేయలగలిగినందుకు సంతోషంగా ఉందని వెల్లడించింది. ఇక సైనా బయోపిక్ ఈ నెల 9న రిలీజ్ కానుండగా.. స్మాషింగ్ వీకెండ్ కోసం తనతో జాయిన్ అవండి అంటూ ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చింది.

Advertisement

Next Story