ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదని కుమిలిపోయిన నటి :Parineeti Chopra

by Shyam |   ( Updated:2021-05-27 07:09:59.0  )
ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదని కుమిలిపోయిన నటి :Parineeti Chopra
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా(Parineeti Chopra) ‘సందీప్ ఔర్ పింకీ పరార్’ (Sandeep Aur Pinky Faraar) సినిమాతో ఆడియన్స్‌ ముందుకొచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న సినిమా గురించి పాజిటివ్‌ టాక్ వచ్చినా సరే పరిణీతి నటనపై మరోసారి విమర్శలు వచ్చాయి. తన బెస్ట్ ఇవ్వలేకపోయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘గర్ల్ ఆన్ ది ట్రైన్’ (The Girl on the Train), ‘సైనా’ (Saina) తర్వాత తన నుంచి రిలీజైన మూడో సినిమా ఇదే కాగా, మూడు చిత్రాల్లోనూ బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇవ్వలేదనే విమర్శలు ఎదుర్కొంది. దీనిపై స్పందించిన పరిణీతి.. పాత్రకు న్యాయం చేసేందుకు ఎప్పుడూ తన వంతు కృషి చేశానని, కానీ చూజ్ చేసుకున్న ప్రాజెక్ట్‌లు ఉత్తమంగా ప్రదర్శించే చాన్స్ ఇవ్వలేదని తెలిపింది. ఒక యాక్టర్‌ తనకున్న టాలెంట్‌ను బయటకు తీసుకురాగలిగితే, అదే బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అని.. కానీ అందరికీ అలాంటి మంచి స్క్రిప్ట్‌లు దొరకవని వివరించింది. తనది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అన్న హీరోయిన్.. కెరియర్ ప్రారంభంలో చేసిన సినిమాలు అవార్డులు, ప్రశంసలు తెచ్చిపెట్టాయి కానీ.. ఆ తర్వాత అకస్మాత్తుగా సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల తన టాలెంట్‌ను క్వశ్చన్ చేసే పరిస్థితి ఎదురైందని ఫీల్ అయింది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదనే విమర్శలతో విసిగిపోయానని.. కానీ తన వరకు ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేందుకే ప్రయత్నిస్తానని తెలిపింది

May be an image of food, flower and grass

May be an image of one or more people and indoor

.

May be an image of 1 person and indoor

Advertisement

Next Story