మళ్లీ నోరుజారిన ఎమ్మెల్యే.. ఈసారి ఏకంగా సీఎం కేసీఆర్‌నే!

by Shyam |   ( Updated:2023-10-10 15:56:15.0  )
Parakala TRS MLA Challa Dharma Reddy
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి మ‌ళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి మాత్రం ఏదో పనిగట్టుకొని అనాలని కాకుండా.. యాదృచ్చికంగా అనేశారు. ఉద్దేశాన్నే బ‌య‌ట‌పెట్టేశారా? లేదా పొరపాటున అన్నారా? అనేది ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. విషయం ఏంటంటే.. గురువారం ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం కంఠాత్మకూరులో ప‌ర్యటించిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నూత‌న‌ వ్యవ‌సాయ చ‌ట్టాలను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ కేంద్రంగా 140 రోజుల నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నా.. ప్రధాన‌మంత్రి మోదీ, కేసీఆర్‌లు ప‌ట్టించుకోని పుణ్యాత్ములంటూ వ్యాఖ్యనించ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed