ఆ హీరోహీరోయిన్ల రిలేషన్ కట్.. ఇక ఆ జోడి కనిపించదా..?

by Shyam |   ( Updated:2021-06-17 02:17:31.0  )
kamalhasan and gowthami news
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రీమేక్ అయ్యి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగులో ‘దృశ్యం’ పేరుతోనే రీమేక్ అయిన ఈ సినిమా లో వెంకటేష్, మీనా జంటగా నటించగా.. తమిళ్ లో కమల్ హాసన్, గౌతమి జంటగా “పాపనాశం” అనే పేరుతో రీమేక్ చేశారు. అన్ని భాషలోనూ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా మలయాళంలో రెండో పార్ట్ కూడా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకోంది. ఇక రెండో భాగాన్ని కూడా తెలుగు, తమిళ్ లో రీమేక్ చేయబోతున్నారు.

తెలుగులో సెకండ్ పార్ట్ లో కూడా వెంకీ, మీనా జంటగా కనిపిస్తుండగా తమిళ్ లో మాత్రం ఈసారి గౌతమి భాగం కాకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. దానికి కారణం కమల్- గౌతమి విడిపోవడమే అని తెలుస్తోంది. దర్శకుడు జీతు జోసెఫ్ “పాపనాశం” చేసినప్పుడు… గౌతమి, కమల్ హాసన్ రిలేషన్ లో ఉన్నారు. అయితే 2016లో కొన్ని సమస్యల కారణంగా ఈ జంట విడిపోయారు. అందుకే ఈ సీక్వెల్ లో గౌతమి ఉండకపోవచ్చని అంటున్నారు. ఆమె స్థానంలో ఒరిజినల్ వెర్షన్ లో నటించిన మీనా పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారని సమాచారం. మరి ఈ విషయంపై కమల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం కమల్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమా లో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Next Story