- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉదయం 4 గంటలకు కోచ్ ఇంటికెళ్లి క్షమాపణ చెప్పిన రిషబ్ పంత్!

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా పర్యటన నుంచి రిషబ్ పంత్ ఒక స్టార్ క్రికెటర్‌గా మారిపోయాడు. ఇప్పుడు అతనికి మాజీ, విదేశీ క్రికెటర్లు కూడా ఫ్యాన్స్‌గా మారిపోయారు. టీమ్ ఇండియాలో అడుగు పెట్టక ముందు నుంచే పంత్ దూకుడుగా ఉండేవాడు. ఇప్పటికీ కపిల్ వంటి దిగ్గజ క్రికెటర్ పంత్ ఆటలోనే కాకుండా మనస్థత్వ పరంగానూ దూకుడు తగ్గించుకోవాలని సలహా ఇచ్చాడు. అయితే పైకి కనపడినంత దూకుడైన మనిషి రిషబ్ కాదని అతడి చిన్నప్పటి కోచ్ తారక్ సిన్హా చెబుతున్నారు. చిన్నప్పుడు ఏదైనా విషయం నేర్చుకోవాలని అనుకుంటే పంత్ అది వచ్చే వరకు పట్టు వదలకుండా కష్టపడేవాడని చెప్పాడు. అంతే కాకుండా పంత్ తప్పు చేస్తే వెంటనే ఆ తప్పు దిద్దుకుంటాడని చెప్పాడు. ఒకసారి ప్రాక్టీస్‌లో తప్పు చేస్తే తాను తిట్టానని.. దీంతో ఉదయం నాలుగైదు గంటల సమయంలో వచ్చి ఇంటి తలుపు కొట్టాడు.. ఆ తర్వాత తనకు క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్లపోయాడని పంత్ గురించి గుర్తు చేసుకున్నాడు.