ఆసియా వృద్ధిరేటు సున్నా : ఐఎమ్ఎఫ్!

by Harish |
ఆసియా వృద్ధిరేటు సున్నా : ఐఎమ్ఎఫ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎమ్ఎఫ్) ఏప్రిల్ నుంచి మొదలైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి 1.1 శాతానికి పడిపోతుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే, 2019-20లో ఇండియా జీడీపీ వృద్ధిరేటు 4.1 శాతం ఉంటుందని అంచనా వేసింది. అలాగే, కొవిడ్-19 మహమ్మారి వల్ల 2020లో ఆసియా వృద్ధి రేటు ‘సున్నా’గా ఉంటుందని ఐఎమ్ఎఫ్ అంచానాలను వెల్లడించింది. ఇది 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత క్షీణత అని, అయితే, మిగిలిన ఖండాలతో పోలిస్తే ఆసియా పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉండే అవకాశముందని ఐఎమ్ఎఫ్ చెప్పడం గమనార్హం. ఇటీవల ‘కొవిడ్-19 మహమ్మారి-ఆసియా,పసిఫిక్’ అనే పేరుతో నివేదిక వివరాలను వెల్లడించింది. కరోనా వ్యాప్తి కారణంగా ఆసియాలో ఇదివరకూ లేనంత ప్రతికూల పరిస్థితులను చూడబోతున్నామని ఐఎమ్ఎఫ్ తెలిపింది. గతంలో 1997 లో ఆసియా ఫైనాన్షియల్ సంక్షోభ సమయంలో ఆసియా వృద్ధిరేటు 1.3 శాతంగా నమోదైందని, తర్వాత 2008లో అంతర్జాతీయ సంక్షోభ సమయంలో ఆర్థిక వృద్ధి రేటు 4.7 శాతంగా నమోదైందని ప్రస్తావించింది.

Tags: Imf, Covid Effect, asia growth rate, asia growth Lockdown, Coronavirus



Next Story

Most Viewed