ఎంపీడీవో పై సస్పెన్ష‌న్ వేటు

by Sridhar Babu |
ఎంపీడీవో పై సస్పెన్ష‌న్ వేటు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : ఖ‌మ్మం జిల్లా టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీలో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆ సంఘం అధ్య‌క్షుడు, ఎంపీడీవో ఏలూరి శ్రీనివాస్‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. కొద్ది రోజుల క్రితం ఆయ‌న అశ్వాపురం నుంచి నారాయ‌ణ‌పేట జిల్లాకు బ‌దిలీ అయిన విష‌యం తెలిసిందే. అయితే బ‌దిలీ ఉత్త‌ర్వులు ఆయ‌న తీసుకోలేదు. దీంతో విధుల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నందుకు స‌స్పెన్ష‌న్ విధిస్తూ పంచాయ‌తీరాజ్ శాఖ క‌మిష‌న‌ర్‌, రూరల్ డెవ‌ల‌ప్‌మెంట్ సస్పెన్షన్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఇదిలా ఉండ‌గా ఆయ‌న కొంత‌కాలంగా రాజ‌కీయ నాయ‌కుల‌తో క‌లివిడిగా తిరుగుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆయ‌న త్వ‌ర‌లోనే ఉద్యోగాన్ని వ‌దిలి బీజేపీలో చేరిపోతార‌ని ఉద్యోగ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న జిల్లా బీజేపీ నేత‌ల‌తో క‌ల‌సి బండి సంజ‌య్‌కు శ‌నివారం అభినంద‌న‌లు తెలప‌డం అనుమానాల‌కు బ‌లం చేకూర్చిన‌ట్ల‌యింది. ఈనేప‌థ్యంలోనే తాజాగా ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డ‌టం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story