రెండు చెంపదెబ్బలతోనే సరి..

by Shamantha N |
రెండు చెంపదెబ్బలతోనే సరి..
X

అత్యాచారయత్నానికి శిక్ష కేవలం రెండు చెంప దెబ్బలు మాత్రమే.. తమ కూతురుపై అత్యాచారయత్నం జరిందని న్యాయం చేయాలని బాధిత కుటుంబీకులు పంచాయతీ పెద్దలను కోరగా బదులుగా రెండు చెంప దెబ్బలు కొట్టాలంటూ తీర్పునిచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ సంఘటన చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని జాష్‌పూర్‌‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. జాష్ పూర్ కు చెందిన యువతి (20) కాలేజీ వెళ్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన నితీష్ భగత్ యువతిని ఇంటి వద్ద దిగబెడతానంటూ బైక్ పై ఎక్కించుకున్నాడు. తెలిసిన వాడు కావటంతో నమ్మిన యువతి అతని బైక్ ఎక్కింది. కొంత దూరం ప్రయాణించకా నెమ్మదిగా బైక్ రూటు మార్చి వేరే ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ యువతిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. కాసేపు భగత్‌తో పెనుగులాడిన యువతి ఎలాగోలా అతని బారి నుంచి తప్పించుకుని ఇల్లు చేరుకుంది. జరిగిన సంఘటన ను తన కుటుంబీకులకు తెలిపింది. దీంతో యువతి కుటుంబీకులు పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు. కాగా నిందితుడు భగత్ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండేవాడని దీంతో విషయం బయటకు పొక్కకుండా అతని సోదరితో కేవలం రెండు చెంపదెబ్బలు కొట్టించారని ఆరోపణ. ఈ తతంగాన్ని గ్రామానికి చెందిన ఒకరు వీడియోతీసి శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త మీడియాకు తెలవంతో చివరికి బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో అతనిపై కేసు పెట్టింది. జాష్‌పూర్ ఎస్పీ బాఘేల్ దీనిపై స్పందిస్తూ యువతి ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేశామని చెప్పారు. పంచాయతీ పెద్దలపై ఏమైనా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించగా దీనిపై విచారణ కొనసాగుతోందని బదులిచ్చారు.

tags;only two slaps,chhattisgarh, rape attempt, victim close to congress legislature

Advertisement

Next Story

Most Viewed