- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీడీపీకి మరో షాక్
by srinivas |

X
అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిష్టానం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్లే పార్టీని వీడుతున్నాని స్పష్టం చేశారు. విశాఖను రాజధానిగా వద్దనడం సరికాదనీ, దీనిని వ్యతిరేకిస్తే పార్టీ నష్టపోతుందని ముందే చెప్పానని వెల్లడించారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలనడంలో తప్పులేదని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికీ సహకరించాలని అధిష్టానాన్ని కోరినప్పటికీ, వినిపించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, సతీష్‌రెడ్డి, కదిరి బాబూరావ్, డొక్కాలు ఇప్పటికే వైసీపీలో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న విషయం తెలిసిందే. రమేశ్ బాబు సైతం వైసీపీలోనే చేరనున్నట్టు తెలుస్తోంది.
Tags: ap, tdp, amaravathi, vishakha, panchakarla, ramesh babu, ycp, resignation,
Next Story